ఏపీలో పెన్షన్ దారులకు శుభవార్త... వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా...!
- పింఛన్ల పంపిణీలో నిబంధనలను సరళతరం చేసిన ఏపీ సర్కార్
- వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం పింఛన్ తీసుకునే వెసులుబాటు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీలో పెన్షన్‌దారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పింఛన్ల పంపిణీని మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి నెలా మొదటి రెండు మూడు రోజుల్లోనే లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.
అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు గ్రామంలో లేకపోతే ఆ నగదును ప్రభుత్వానికి వెనక్కి పంపుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆ నెల పింఛన్‌ను నష్టపోవాల్సి వస్తుంది. ఈ కారణంగా వివిధ పనులపై దూర ప్రాంతాల్లో ఉన్నా పింఛన్ల కోసం ప్రతి నెలా ఒకటవ తేదీ నాటికి వ్యయ ప్రయాసలకోర్చి స్వగ్రామానికి చేరుకుంటున్నారు. పింఛన్ తీసుకున్న తర్వాత మళ్లీ పనులకు వెళుతున్నారు.
లబ్ధిదారుల బాధలను గుర్తించిన ప్రభుత్వం పింఛన్ పంపిణీ నిబంధనలను సరళతరం చేసింది. రెండు నెలల పాటు వరుసగా పింఛన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే .. అతని భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పెన్షన్ మంజూరు చేసేలా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.