‘కారుపై నుంచి వెళ్లగొడతావా?’ కాకుల దాడి వీడియో ఇదిగో...!

  • ఒక కారు యజమానిని వణికించిన కాకులు
  • కారుపై నుంచి వెళ్లగొట్టినందుకు ఆగ్రహంతో దాడి
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
కారుపై కాకి వాలింది. యజమాని వచ్చి కాకే కదా... హుష్‌ అంటే పోతుందనుకున్నాడు. కానీ కారుపై అలాగే ఉండిపోయింది. చేతితో నెట్టివేయాలని చూశాడు. కానీ కాకి కదలలేదు... ఇలా కాదని దగ్గరగా వెళ్లి, కాకిని చేతిలోకి తీసుకుని, ఓ పక్కకు విసిరేద్దామనుకున్నాడు. 

కానీ కాకిని అలా చేతిలోకి తీసుకోగానే... చుట్టుపక్కల ఉన్న మరికొన్ని కాకులు వేగంగా దూసుకొచ్చాయి. ఆ కారు యజమానిని కాళ్లతో తన్ని ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. ఇదేమిటని అతడు భయంగా చూస్తుంటే... పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై వాలి, మళ్లీ మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నించాయి.

  • ‘ఎక్స్‌’లోని ఓ ఖాతాలో పోస్ట్‌ అయిన ఈ వీడియో వైరల్‌ గా మారింది.
  • ఈ వీడియోకు కేవలం రెండు గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వేల కొద్దీ లైకులు కూడా వచ్చాయి.
  • "కాకుల గ్యాంగ్‌ తో పెట్టుకుంటే అంతే..’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ‘పాపం అంత సున్నితంగా వ్యవహరించిన అతడిపై కాకులు దాడి చేయడం దారుణం" అన్నట్టు మరికొందరు సానుభూతి చూపుతున్నారు.


More Telugu News