స్టాక్ మార్కెట్లకు నష్టాలు... భారీగా నష్టపోయిన అదానీ పోర్ట్స్

  • మార్కెట్లపై అదానీ ఎఫెక్ట్
  • 422 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 168 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ నష్టాలను మూటకట్టుకున్నాయి. అదానీపై అమెరికాలో కేసులు, అంతర్జాతీయ ప్రతికూలతలతో మన మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 422 పాయింట్లు నష్టపోయి 77,155కి పడిపోయింది. నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి 23,349కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.41%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.87%), టాటా స్టీల్ (0.57%), టీసీఎస్ (0.49%).

టాప్ లూజర్స్:
అదానీ పోర్ట్స్ (-13.53%), ఎన్టీపీసీ (-2.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.64%), ఐటీసీ (-2.18%), ఏషియన్ పెయింట్స్ (-2.17%).


More Telugu News