అమెరికాలో లంచం ఆరోపణల కేసుపై అదానీ గ్రూప్ ప్రకటన
- అదానీ గ్రూప్ పై లంచం ఆరోపణలు
- అమెరికాలో కేసు నమోదు
- భారత్ లో తీవ్ర రాజకీయ దుమారం
- అమెరికా న్యాయ విభాగం ఆరోపణలు నిరాధారమన్న అదానీ గ్రూప్
ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ పై అమెరికాలో లంచం ఆరోపణలతో కేసు నమోదు కావడం తెలిసిందే. దీనిపై భారత్ లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ నుంచి ప్రకటన వెలువడింది.
అమెరికా న్యాయ విభాగం ఆరోపణలు నిరాధారమని, అందులో నిజం లేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, నిజాలు నిరూపితమయ్యే వరకు దోషులు కాదన్న విషయం అమెరికా న్యాయ విభాగం ప్రకటనలోనే ఉందని పేర్కొంది. తమ సంస్థ లావాదేవీల విషయమై పూర్తి పారదర్శకతతో నియంత్రణ సంస్థల నిబంధనలను పాటిస్తున్నామని వెల్లడించింది.
చట్టాలపై గౌరవం ఉందని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని భాగస్వాములు, వాటాదారులు, ఉద్యోగులకు చెప్పామని... ఆ మేరకే తాము నడుచుకుంటున్నామని అదానీ గ్రూప్ వివరించింది.