మీ చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే... ఫ్యాటీ లివర్ డిసీజ్ కావొచ్చు!
- ఉన్నట్టుండి చర్మంపై అసాధారణ మార్పులు రావడం వ్యాధులకు చిహ్నం
- కాలేయం దెబ్బతిన్నప్పుడు కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు
- వాటిని వెంటనే గుర్తించి పరీక్షలు చేయించుకోవాలంటున్న ఆరోగ్య నిపుణులు
ఉన్నట్టుండి మీ ముఖం, చర్మంపై అసాధారణ మార్పులు వస్తుంటే అది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయం పనితీరు సరిగా లేకపోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయని, ఆహారం సరిగా జీర్ణంకాదని చెబుతున్నారు. శరీరంలో పేరుకునే వ్యర్థాల వల్ల చర్మంపై, లింఫ్ గ్రంథులపై ప్రభావం పడుతుందని... దీనితో కొన్ని రకాల సమస్యలు ఏర్పడుతాయని వివరిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆ లక్షణాలు ఏమిటంటే...
ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుండటం...
ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తినప్పుడు కాలేయంలో ఉత్పత్తయే కొన్ని ప్రొటీన్లు తగ్గిపోతాయి. దానితో రక్త ప్రసరణ తీరు, వ్యర్థ ద్రవాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దానితో శరీరంలో వాపు వస్తుంది. ముఖ్యంగా ముఖం స్వల్పంగా ఉబ్బిపోయి కనిపిస్తుంది.
చర్మం నల్లగా మారడం...
ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చినవారి శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే శరీరం ఇన్సులిన్ ను సరిగా వినియోగించుకోలేకపోతుంది. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయులు పెరిగిపోయి... ‘అకంథోసిస్ నిగ్రికాన్స్’ అనే సమస్య తలెత్తుతుంది. దీనితో మెడ, బాహుమూలాలు వంటి చర్మం ముడతలు పడే భాగాల్లో... చర్మం నల్లగా మారుతుంది.
కామెర్లు...
ఫ్యాటీ లివర్ సమస్య ముదిరితే... పచ్చ కామెర్ల వ్యాధి వస్తుంది. చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపు వర్ణంలోకి మారుతాయి. మూత్రం కూడా ముదురు పసుపు, నారింజ రంగుల్లో వస్తుంది.
చర్మంపై తరచూ దురద అనిపించడం
కాలేయం రక్తంలోని బైల్ సాల్ట్స్ ను బ్రేక్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఇలా బైల్ సాల్ట్స్ రక్తంలో పేరుకుపోవడం వల్ల... చర్మంపై తరచూ దురదగా అనిపిస్తుంటుంది. అలర్జీ మందులు వంటివి వాడినా ఆ దురద తగ్గదు.
చర్మంపై ఎర్రటి మచ్చలు
కాలేయ సమస్య మరింత ముదిరినప్పుడు చర్మంపై ఎరుపు రంగులోని మచ్చలు ఏర్పడుతాయి. కొన్నిసార్లు తీవ్రంగా దురద పెడుతుంటాయి.
ఈ అంశాలు గుర్తుంచుకోండి!
పైన చెప్పిన లక్షణాలు ఉన్నంత మాత్రాన కచ్చితంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్టు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఇతర వ్యాధుల కారణంగా కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చని వివరిస్తున్నారు.
అయితే ఇలాంటి అసాధారణ లక్షణాలు కనిపించడం అంటే... ఏదో ఒక ఆరోగ్య సమస్య మాత్రం ఉన్నట్టేనని స్పష్టం చేస్తున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకుని... తగిన మందులు వాడాలని సూచిస్తున్నారు.