కర్నూలులో హైకోర్టు బెంచ్ కు ఏపీ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

  • కర్నూలు హైకోర్టు బెంచ్ కు నిన్న కేబినెట్ ఆమోదం
  • ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అసెంబ్లీ
  • లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అక్కడే ఉంటాయన్న సీఎం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హైకోర్టు బెంచ్ పై సభలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... కర్నూలులో హైకోర్టు బెంచ్ పై నిన్ననే కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపామని వెల్లడించారు. లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కర్నూలులోనే ఉంటాయని తెలిపారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. 

మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని చంద్రబాబు విమర్శించారు. అమరావతి రాజధానికి విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారని చెప్పారు. 

రాయలసీమకు అవకాశాలు కూడా ఎక్కువని... చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు రాయలసీమకు దగ్గరగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు. పుట్టపర్తి, ఓర్వకల్లు, కడప, తిరుపతి నాలుగు ఎయిర్ పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయని చెప్పారు.


More Telugu News