ఒత్తిడితో మొదలుకొని మతిమరుపు దాకా.. మొబైల్ ఫోన్ తో వచ్చే కొన్ని అనారోగ్యాలు
- కళ్ల సమస్యలకు దారితీస్తున్న ఫోన్ వాడకం
- జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తోందంటున్న నిపుణులు
- గుండె పనితీరుపైనా ప్రభావం పడుతుందట
తెల్లవారి నిద్రలేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ చేతిలో మొబైల్ ఉండాల్సిందే.. నిమిషానికి ఓసారి దానివైపు చూడాల్సిందే. ఆహారం తీసుకుంటున్నా, ఆఫీసు నుంచి వచ్చి అలా సేదదీరుతున్నా.. చివరకు బాత్రూమ్ లోనూ చేతిలో ఫోన్ ఉండాల్సిందే అనే వాళ్లు కోకొల్లలు. అయితే, ఈ అతి వాడకం వల్ల స్మార్ట్ కావడం సంగతేమో కానీ మతిమరుపు సహా పలు అనారోగ్యాల బారిన పడడం మాత్రం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ అతిగా వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ముప్పు పెరుగుతుందని ప్రచారం జరుగుతోందని అయితే, దీనికి ఇప్పటి వరకు బలమైన ఆధారాలు ఏవీ లభించలేదని వివరించారు. మొబైల్ వాడకం నేరుగా క్యాన్సర్ కు దారితీయదని ఎన్విరాన్ మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించిన ఓ పరిశోధనా పత్రం వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్ వల్ల ఎదుర్కొనే అనారోగ్య సమస్యలలో కొన్ని..
1. కళ్లపై ఒత్తిడి
అదేపనిగా ఫోన్ ను ఎక్కువ సేపు చూస్తుంటే కళ్లపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’ లేదా ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ గా వ్యవహరిస్తున్నారు. ఫోన్ లో నుంచి వెలువడే బ్లూలైట్ వల్ల కళ్లు ఒత్తిడి గురవుతాయి. ఇది కళ్లు మసకబారడానికి దారితీస్తుంది. కళ్లు పొడిబారడం, తలనొప్పి తదితర సమస్యలు ఎదురవుతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. మిగతా వారితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ వాడేవారికి కళ్ల సమస్యల ముప్పు 39.7 శాతం ఎక్కువ.
2. టెక్ట్స్ నెక్
రీల్స్ చూస్తున్నపుడో లేక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నపుడో చేతిలో ఫోన్ పట్టుకు ముందుకు వంగి కూర్చోవడం సాధారణమే. ఇలా కూర్చోవడాన్ని టెక్ట్స్ నెక్ గా వ్యవహరిస్తారు. ఇలా కూర్చున్నపుడు మెడ, భుజాలు స్టిఫ్ గా ఉంటుందని, ఇది దీర్ఘకాలిక కండరాల నొప్పులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
3. నిద్రలేమి
రాత్రిపూట బెడ్ పైకి చేరగానే చేతిలో మొబైల్ తీసి చూడడం సాధారణంగా మారిపోయింది. ఈ అలవాటు నిద్రలేమికి దారితీస్తుందని, స్లీప్ క్వాలిటీని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ తెరపై నుంచి వెలువడే బ్లూలైట్ మన శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఈ హర్మోన్ కొరత వల్ల నిద్రకు దూరమవుతామని వివరించారు.
4. గుండె జబ్బులు
రోజులో ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ కు వెచ్చించే వారిలో హృద్రోగ సమస్యల బారిన పడే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు వెల్లడించారు. కెనెడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ దీనికి సంబంధించిన ఓ పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. అతిగా మొబైల్ వాడుతుంటే, మరీ ముఖ్యంగా రాత్రిపూట నిద్రించే సమయంలో ఫోన్ వాడుతుంటే రిస్క్ ఎక్కువవుతుంది. పొగతాగేవారికి, మధుమేహ బాధితులకు ఈ ముప్పు మరింత ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
5. శారీరక ఒత్తిడి
కాలక్షేపం కోసమైనా లేక ఆఫీసు పనిలో భాగంగానైనా ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చాలామందిలో ఈ సమస్య కనిపిస్తోందని డాక్టర్ అగర్వాల్ చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడి, అశాంతి, ఆందోళన.. తదితర ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.
6. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
మొబైల్ ఫోన్ పై అతిగా ఆధారపడడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, తరచుగా వచ్చే నోటిఫికేషన్లను చెక్ చేసుకోవడం, ఫోన్ లోని వివిధ యాప్ లను చూస్తుండడం వల్ల ఏ విషయంపైనా ఏకాగ్రత కుదరదని నిపుణులు వివరించారు. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ వాడడం మొదలుపెట్టకముందు స్నేహితులు, బంధువులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కనీసం ఓ పదిమందివన్నా నోటికి గుర్తుండేవని, ఇప్పుడు ఇంట్లో వాళ్ల నెంబర్లు కూడా ఎవరికీ గుర్తుండడంలేదని చెప్పారు.
7. మస్కులోస్కెలటల్ డిజార్డర్
ఫోన్ వాడుతున్న సమయంలో కూర్చునే, పడుకునే పొజిషన్ వల్ల శరీరంలో వివిధ భాగాలపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెడ, భుజాలు, వెన్ను నొప్పి తదితర ఇబ్బందులు సాధారణంగా మారతాయని వివరించారు.
8. వ్యసనం
వ్యసనం అంటే మద్యపానమో లేక ధూమపానమో గుర్తుకొస్తాయి కానీ మొబైల్ వాడకం కూడా ఇప్పుడు వ్యసనంగా మారిపోయిందని వైద్య నిపుణులు తెలిపారు. చేతిలో ఫోన్ లేకుండా ఉండలేక పోవడం, క్షణానికి ఓసారి ఫోన్ చెక్ చేసుకుంటుండడం మొబైల్ వ్యసనంగా మారిందనేందుకు సంకేతమని హెచ్చరించారు. దీనివల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని, చేతిలో ఫోన్ లేకుండా ఏ పని చేయాలన్నా తీవ్రంగా ఆందోళన చెందే పరిస్థితి ఎదురవుతుందని వివరించారు.