సినీ నటి కస్తూరికి ఊరట
- తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసు
- రిమాండ్ లో ఉన్న కస్తూరి
- బెయిల్ మంజూరు చేసిన ఎగ్మోర్ మేజిస్ట్రేట్
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిన వ్యాఖ్యలు చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న సినీ నటి కస్తూరికి ఊరట లభించింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఓ సభలో కస్తూరి మాట్లాడుతూ... తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారిక డీఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కస్తూరిపై తమిళనాడులోని తెలుగు సంఘాలు పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో, ఆమెపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా... ఆమె విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. దీంతో, హైదరాబాద్ లో ఉన్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ఎగ్మోర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమెకు ఈనెల 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ దయాళన్ ఆమెకు బెయిల్ మంజూరు చేశారు.