మహేశ్ - రాజమౌళి సినిమాపై రానా దగ్గుబాటి అంచనాలు ఇవే

  • హాలీవుడ్ సినిమాల మాదిరిగా ఎస్ఎస్ఎంబీ29 అమెరికాలో విడుదలవుతుందని ఆశాభావం
  • అన్ని అవరోధాలు అధిగమిస్తుందన్న రానా దగ్గుబాటి
  • ఓటీటీలు వచ్చాక భాష పరిధులు తొలగిపోయాయని వ్యాఖ్య
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఎస్ఎస్ఎంబీ29పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా కథ అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగనుందని, బడ్జెట్‌ రూ.1000 కోట్లు పైగానే ఉంటుందని, హాలీవుడ్ నటులు సైతం ఈ సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేశాయి.

ఈ నేపథ్యంలో మహేశ్-రాజమౌళి కాంబో సినిమాపై రానా దగ్గుబాటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. హాలీవుడ్ సినిమాల మాదిరిగా ఎస్ఎస్ఎంబీ29 (వర్కింగ్ టైటిల్) మూవీ అమెరికాలో విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ హాలీవుడ్‌ మూవీ యూఎస్‌లో ఏవిధంగా విడుదలవుతుందో ఎస్ఎస్ఎంబీ29 సినిమా కూడా అదే స్థాయిలో విడుదల కావాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను. తప్పకుండా అది జరుగుతుంది. ఆ సినిమా అన్ని అడ్డంకులను అధిగమిస్తుంది’’ అని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదివరకు వేరే దేశాల వారికి భారతీయ సినిమా అంటే హిందీ సినిమాలు మాత్రమే తెలిసేవని, ఇతర భాషల్లోనూ భారతీయ సినిమాలు ఉంటాయనే విషయం వారికి తెలియదని రానా ప్రస్తావించాడు. ఇప్పుడు మన సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటున్నారని రానా అన్నాడు. ఓటీటీలు వచ్చాక భాష పరిధులు తొలగిపోయాయని, పెద్ద సినిమాలే కాదు.. స్థానిక కథలతో రూపొందిన ఇండిపెండెంట్ సినిమాలను కూడా వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా ఈ వ్యాఖ్యలు చేశాడు.


More Telugu News