రేవంత్ రెడ్డి పతనం నా ద్వారానే ప్రారంభమవుతుంది: పట్నం మహేందర్ రెడ్డి
- రైతులకు మద్దతిస్తే అక్రమ కేసులు పెడతారా? అని నిలదీత
- పోలీస్, ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే దాడి జరిగిందన్న బీఆర్ఎస్ నేత
- దీనిని డైవర్ట్ చేసేందుకు కేసులు పెట్టారని ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుంచి మొదలవుతుందని, పతనం నా ద్వారానే ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈరోజు ఆయనను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. నరేందర్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ... రైతులకు మద్దతిస్తే తమపై అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. పోలీస్, ఇంటెలిజెన్స్, ముఖ్యమంత్రి వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందన్నారు. దీనిని డైవర్ట్ చేసేందుకే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ కేసు కుట్రలో భాగమే అన్నారు. న్యాయస్థానాల మీద గౌరవం ఉందని, నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.