మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే అధికారం: ఎగ్జిట్ పోల్ అంచనాలు

  • బీజేపీ కూటమికి 130 నుంచి 160 సీట్లు రావొచ్చునని అంచనా
  • కాంగ్రెస్ కూటమికి 120 నుంచి 140 సీట్లు రావొచ్చునని అంచనా
  • బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఓటర్ల పట్టం!
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎక్కువ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ కూటమికి 130 నుంచి 160 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

పీ మార్క్ - బీజేపీ కూటమి: 137 నుంచి 157, కాంగ్రెస్ కూటమి: 126 నుంచి 146
పీపుల్స్ పల్స్ - బీజేపీ కూటమి: 182 ప్లస్, కాంగ్రెస్ కూటమి: 97 ప్లస్
ఏబీపీ-మ్యాట్రిజ్ - బీజేపీ కూటమి: 150 నుంచి 170, కాంగ్రెస్ కూటమి: 110 నుంచి 130
చాణక్య - బీజేపీ కూటమి: 150 నుంచి 160, కాంగ్రెస్ కూటమి: 130 నుంచి 138
సీఎన్ఎస్-న్యూస్ 18 - బీజేపీ కూటమి: 154, కాంగ్రెస్ కూటమి: 128
లోక్ శాహి మరాఠి - బీజేపీ కూటమి: 128 నుంచి 142, కాంగ్రెస్ కూటమి: 125 నుంచి 140
దైనిక్ భాస్కర్ - బీజేపీ కూటమి: 128 నుంచి 140, కాంగ్రెస్ కూటమి: 135 నుంచి 150


More Telugu News