ప్లేస్టోర్​ లో బెస్ట్​ యాప్స్–2024 గూగుల్​ ప్రకటించిన యాప్స్​ ఇవే...

  • గూగుల్ ప్లేస్టోర్ లో లక్షల కొద్దీ యాప్స్
  • ఏటా అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రకటిస్తున్న గూగుల్
  • విభాగాల వారీగా టాప్ యాప్స్ వివరాలు వెల్లడి
ఇప్పుడు ప్రపంచమంతా మన ఫోన్ లోకే వచ్చేసింది. ఇంట్లోకి అవసరమైన సామగ్రి బుకింగ్, బిల్లుల చెల్లింపు నుంచి వినోదం దాకా అన్నింటికీ రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాల అవసరాలను తీర్చేలా ఎన్నో సంస్థలు తమ యాప్ లను విడుదల చేశాయి. అందులో వినియోగదారులకు సౌకర్యవంతంగా, బాగా పనిచేసే, ఉత్తమ సదుపాయాలు ఉన్న యాప్స్ ను గూగుల్ సంస్థ ఎంపిక చేసి.. టాప్ యాప్స్ కింద వివిధ కేటగిరీల్లో ప్రకటిస్తుంది. అలా భారత్ కు సంబంధించి తాజాగా ప్రకటించిన టాప్ యాప్స్ వివరాలివిగో...

 మొత్తంగా బెస్ట్ యాప్ తో పాటు బెస్ట్ ఫర్ ఫన్ కేటగిరీలో... ‘అల్లీ (Alle - Your AI Fashion Stylist)’ యాప్ ఎంపికైంది.
 

బెస్ట్ మల్టీ డివైజ్ యాప్ కేటగిరీలో... ‘వాట్సాప్ (WhatsApp Messenger)’ నిలిచింది. అటు కంప్యూటర్లలోనూ, ఇటు ఫోన్లు, ట్యాబ్లెట్లలోనూ దీని వినియోగం చాలా సులువు కావడంతో టాప్ లో నిలిచింది.

బెస్ట్ పర్సనల్ గ్రోత్ కేటగిరీలో... ‘హెడ్ లైన్ (Headlyne: Daily News with AI)’ యాప్ నిలిచింది.

బెస్ట్ ఎవ్రీడే ఎస్సెన్షియల్ ఫోల్డ్ కేటగిరీలో.. ‘ఎక్స్ పెన్స్ ట్రాకర్ (Fold:Automatic Expense Tracker)’ యాప్ టాప్ లో నిలిచింది.

బెస్ట్ ఫర్ వాచెస్ కేటగిరీలో... ‘బేబీ డేబుక్ (Baby Daybook - Newborn Tracker)’ యాప్ టాప్ లో నిలిచింది.

బెస్ట్ ఫర్ లార్జ్ స్క్రీన్స్ విభాగంలో... ‘సోనీ లివ్ (Sony LIV: Sports & Entmt)’ యాప్ టాప్ లో నిలిచింది.


More Telugu News