వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాశ్ ను విచారించాలి: షర్మిల
- తమపై కించపరిచే పోస్టులు పెట్టించింది అవినాశ్ రెడ్డి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారన్న షర్మిల
- సజ్జల భార్గవరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న
- తెర వెనకున్న వారిని అరెస్ట్ చేయకపోతే న్యాయం జరగదని వ్యాఖ్య
తనతో పాటు తన తల్లి విజయమ్మ, సోదరి సునీతలపై సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు పెట్టించింది కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అని పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. అయినప్పటికీ ఆయనను ఇంకా ఎందుకు విచారించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ సైకో వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాశ్ రెడ్డిని విచారించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవరెడ్డి మూలకారణమని... ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
అసభ్యకర పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా పోలీసులు వదిలిపెట్టవద్దని షర్మిల అన్నారు. పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు... వారి వెనకున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. తెర వెనకున్న వారిని వదిలేస్తే న్యాయం జరగదని చెప్పారు. వివేకా హత్య కేసులో సునీతకు తాను అండగా ఉంటానని... అసలు దోషులు ఎవరో కనిపెట్టి శిక్షించాలని అన్నారు.