సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. గరిష్ఠంగా 1.20 లక్షల జీతం

  • స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • డిసెంబర్ 3 తో ముగియనున్న దరఖాస్తు గడువు
  • ముంబై, హైదరాబాద్ లలో 253 ఖాళీలు
బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 253 స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగం సాధించడానికి ఇదే మంచి అవకాశం. ఇంజనీరింగ్, పీజీ, డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సీబీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. హైదరాబాద్, ముంబైలలో ఖాళీగా ఉన్న 253 స్పెషల్ ఆఫీసర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ https://www.centralbankofindia.co.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ లో రాత పరీక్ష నిర్వహించి, ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2025 జనవరిలో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఖాళీలు: 253 స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలు
విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, డిగ్రీ, పీజీ, ఎంసీఏ, డిప్లొమాలతో పాటు తగిన అనుభవం
ఏజ్ లిమిట్: 23 నుంచి 40 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు: రూ. 850 (జనరల్/ ఓబీసీ), రూ.175 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు)
జీతం: పోస్టును బట్టి రూ.45,000 నుంచి రూ.1,20,000
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు గడువు డిసెంబర్ 3, రాత పరీక్ష డిసెంబర్ 14, ఇంటర్వ్యూ 2025 జనవరి రెండో వారంలో..



More Telugu News