ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి గయానాలో పర్యటించిన ప్రధానిగా మోదీ రికార్డు
- గయానా రాజధాని జార్జ్‌టౌన్‌కు చేరుకున్న ప్రధాని
- మోదీకి ఘనస్వాగతంతోపాటు గార్డ్ ఆఫ్ ఆనర్
- గయానా పార్లమెంటులో ప్రసంగించనున్న మోదీ
- ఆ దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో ద్వైపాక్షిక చర్చలు
గత 56 ఏళ్లలో గయానాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డులకెక్కారు. బుధవారం గయానా రాజధాని జార్జ్‌టౌన్‌కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతంతోపాటు గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. విమానాశ్రయంలో గయానా అధ్యక్షుడు మొహమద్ ఇర్ఫాన్ అలీ భారత ప్రధానికి స్వాగతం పలికారు.
గయానా అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అలాగే, ఆ దేశ పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రసంగిస్తారు. సెకండ్ ఇండియా-కరికోమ్ సమావేశంలో గయానా ప్రధాని గ్రెనెడాతో సమావేశమవుతారు. కరికోమ్ అనేది కరీబియన్ కమ్యూనిటీ. ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక సహకారం, ఏకీకరణ పెంపునకు పాటుపడుతోంది. ఇందులో 21 దేశాలు ఉండగా అందులో 15 సభ్య దేశాలు, మిగతా ఆరు అసోసియేట్ దేశాలు.
185 సంవత్సరాల క్రితం గయానాకు వలస వచ్చిన పురాతన భారతీయ కమ్యూనిటీలలో ఒకదానికి గౌరవం లభించబోతున్నట్టు పర్యటనకు ముందు మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. భాగస్వామ్య వారసత్వం, సంస్కృతి, విలువలపై వ్యూహాత్మక దిశానిర్దేశం చేయడంపై అభిప్రాయ మార్పిడి చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. భారత్-గయానా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని అన్వేషించడమే మోదీ పర్యటన లక్ష్యం.