ఆపిల్ యాప్ స్టోర్ లో 'ఫోన్ పే' టాప్
- ఆపిల్ యాప్ స్టోర్ లో ఫోన్ పే యాప్ కు 6.4 మిలియన్ల రేటింగ్స్
- సగటున 4.7 స్టార్స్ తో రేటింగ్
- ఐఓఎస్ లో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లను వెనక్కి నెట్టిన ఫోన్ పే
యూపీఐ చెల్లింపుల యాప్ ఫోన్ పే ఆపిల్ యాప్ స్టోర్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఆపిల్ యాప్ స్టోర్ లో ఫోన్ పే యాప్ కు 6.4 మిలియన్ల రేటింగ్స్ వచ్చాయి. ఈ ఇండియన్ యాప్ కు ఆపిల్ స్టోర్ లో 4.7 స్టార్స్ తో సగటు రేటింగ్ లభించడం విశేషం. ఐఓఎస్ యాప్ స్టోర్ లో రేటింగ్స్ పరంగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ యాప్ లను ఫోన్ పే వెనక్కి నెట్టింది.
ఆర్థిక లావాదేవీల పరంగా అత్యంత విజయవంతమైన ట్రాక్ రికార్డు, వేగవంతమైన ట్రాన్సాక్షన్స్, యూజర్లలో ఫోన్ పే పట్ల నమ్మకం... ఇవన్నీ కలిపి ఆపిల్ యాప్ స్టోర్ లో ఫోన్ పేను అగ్రస్థానంలో నిలిపాయి. ఈ విషయాన్ని ఫోన్ పే సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి వెల్లడించారు.
ఆపిల్ యాప్ స్టోర్ లో తమకు అద్భుతమైన రేటింగ్ రావడం పట్ల థ్రిల్లవుతున్నామని తెలిపారు. ఫోన్ పే ఐఓఎస్ వెర్షన్ ను వాడుతున్న అనేకమంది యూజర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే సేవలు అందించడం ద్వారా యూజర్ల నమ్మకాన్ని నిలుపుకుంటామని రాహుల్ చారి తెలిపారు.
ఓవరాల్ గా ఫోన్ పే యాప్ కు 57 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.