ఇన్ని కళ్లుంటే చూసేదెలా...? ఎక్కువ కళ్లుండే జీవులివే...!
- మనుషులు సహా చాలా జీవులకు ఉండేది రెండు కళ్లే
- కొన్ని రకాల జీవులకు మాత్రం ఎక్కువ సంఖ్యలో కళ్లు
- ఆహారం, శత్రువుల నుంచి రక్షణ కోసమే ఈ ఏర్పాటు
మనుషులు సహా చాలా జీవరాశులకు ఉండేది రెండు కళ్లే. కానీ కొన్ని రకాల జీవులకు మాత్రం రెండు కంటే ఎక్కువ కళ్లు ఉంటాయి. తమ పరిసరాలకు అనుగుణంగా బతకడానికి, శత్రువుల నుంచి నిరంతరం కనిపెట్టుకుని ఉండటానికి... ఈ ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి కొన్ని జీవులు ఏవో, వాటికి ఎన్ని కళ్లు ఉన్నాయో చూద్దామా..
సాలీడు పురుగులు
చాలా జాతుల సాలీడు (స్పైడర్స్) పురుగులకు ఎనిమిది కళ్లు ఉంటాయి. అందులో రెండు పెద్ద కళ్లు పైభాగంలో ఉంటే... వాటికి దిగువగా చుట్టూ మిగతా కళ్లు ఉంటాయి. చుట్టూ ఉన్న పరిసరాలను నిరంతరం గమనించేందుకు అవి ఇలా పరిణామం చెందాయి.
హార్స్ షూ క్రాబ్స్
సముద్రంలో ఉండే హార్స్ షూ క్రాబ్స్ కు పది కళ్లు ఉంటాయి. ఇరువైపులా రెండు పెద్ద కళ్లు ఉంటే.. మధ్య భాగంలో మరో ఐదు కళ్లు ఉంటాయి. వెనకాల తోక భాగంలో మిగతా కళ్లు ఉంటాయి.
బాక్స్ జెల్లీ ఫిష్
నిజానికి చాలా వరకు జెల్లీ ఫిష్ లకు కళ్లు ఉండవు. కేవలం కొన్ని రకాల జెల్లీ ఫిష్ లకే కళ్లుంటాయి అందులో బాక్స్ జెల్లీ ఫిష్ ఒకటి. దీనికి శరీరమంతా కలిపి 24 కళ్లు ఉంటాయి.
స్కాలోప్స్ (ఒక రకం నత్తగుల్లలు)
అన్ని జీవుల కన్నా ఎక్కువ కళ్లున్న జీవులు స్కాలోప్స్ అని చెప్పవచ్చు. వీటికి శరీరం అంచుల వెంట సన్నని, నీలి రంగులో ఉండే 200కు పైగా కళ్లు ఉంటాయి.
స్టార్ ఫిష్
సముద్రాల్లో అడుగున ఉండే స్టార్ ఫిష్ లకు వాటి ఐదు భుజాల అంచులకు ఐదు కళ్లుంటాయి. మధ్యలో మరో మూడు నుంచి ఐదు కళ్లు ఉంటాయి. మొత్తంగా 10 వరకు కళ్లు ఉంటాయన్న మాట.
మాంటిస్ ష్రింప్
భూమ్మీది జీవరాశుల్లో అత్యంత సంక్లిష్టమైన కళ్లు ఉన్నది మాంటిస్ ష్రింప్ లకే. తలపై భాగంలో రెండు పెద్ద కళ్లు ఉంటాయి. అందులోనూ ఒక్కో కన్ను మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. అంటే అవి ఒకేసారి మూడు దిక్కులను చూడగలవన్న మాట.
బొద్దింకలు
వీటికి తలపై రెండు పెద్ద కళ్లు ఉంటాయి. వాటికన్నా పై భాగంలో మరో మూడు చిన్న చిన్న కళ్లు ఉంటాయి. వీటి సాయంతో చీకట్లోనూ కొంత వరకు చూడగలిగే శక్తి బొద్దింకలకు ఉంటుంది. అందుకే అవి చీకటి ప్రదేశాల్లో ఉంటుంటాయి.