'పుష్ప-2' విషయంలో అంచనాలు తారుమారు!

  • ట్రెండింగ్‌లో పుష్ప-2 ట్రైలర్‌ 
  •  పాట్నాలో జనసంద్రం సమక్షంలో ట్రైలర్‌ విడుదల 
  • హాట్‌ టాపిక్‌గా మారిన 'పుష్ప-2' ట్రైలర్‌ ఈవెంట్‌
అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పుష్ప-2 ది రూల్‌' ఇప్పుడు ఇండియా మొత్తం హాట్‌ టాపిక్‌గా మారింది. గత కొన్నాళ్ల క్రితం నుంచి ఈ చిత్రం గురించి భారతదేశంతో పాటు ప్రపంచ సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 17న బీహర్‌ రాజధాని పాట్నాలో జరిగిన ఈ చిత్రం ట్రైలర్‌ వేడుక ఇండియా లెవల్‌లో అందర్ని షాక్‌కు గురిచేసింది. ఎక్కడ చూసినా పుష్ప గురించే చర్చ జరుగుతుంది. 

తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇప్పుడు ఇది ట్రెండింగ్‌ పాయింట్‌గా మారింది. పాట్నాలో జరిగిన 'పుష్ప-2 ది రూల్‌' ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుకకు దాదాపు రెండున్నర లక్షల మంది హాజరు కావడమే ఇందుకు కారణం. ఓ తెలుగు హీరో నటించిన పాన్‌ ఇండియా సినిమా ఫంక్షన్‌ నార్త్‌ ఇండియాలో జరిగితే ఇంతలా జనసంద్రం కనిపించడం ఇదే తొలిసారి అంటున్నారు సినీ విశ్లేషకులు. 

మొదట్లో ఈ ఈవెంట్‌ను అక్కడ నిర్వహించాలని అనుకున్నప్పుడు గరిష్టంగా 25 వేల మంది హాజరుకావచ్చనే అంచనా వేశారు మేకర్స్‌. అయితే వీళ్ల అంచనాలు తారుమారు అయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ట్రైలర్‌ ఈవెంట్‌కు అనూహ్యరీతిలో రెండున్నర లక్షల మందికి పైగా రావడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. ఈ జనసంద్రంను చూసిన హీరో అల్లు అర్జున్‌ ఎంతో ఆనందపడ్డాడు. మీ ప్రేమకు నేను తలవంచుతున్నానని, మీ ప్రేమను పొందడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. 

ఇక ఈ వేడుకతో పాటు 'పుష్ప ది రూల్‌' ట్రైలర్‌ కూడా ఇండియన్‌ సినిమాలో పలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇంతటి మాసివ్‌ ట్రైలర్‌ చూడలేదని స్పందిస్తున్నారు. ట్రైలర్‌లోని ప్రతి విజువల్‌ గురించి అందరూ డిస్కస్‌ చేసుకునే స్థాయిలో అనూహ్యమైన పాజిటివ్ వైబ్స్‌ 'పుష్ప-2 ది రూల్‌'  సొంతం చేసుకుంది. సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని ఇన్‌సైడ్‌ టాక్‌. 

దాదాపు రూ. 1000 కోట్ల బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్పరాజ్‌ తొలిరోజే మూడొందల కోట్లు కొల్లగొట్టడానికి రెడీగా వున్నాడని, సినిమాకు ఏ మాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా రూ. 1500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


More Telugu News