మిస్ యూనివర్స్ గా 21 ఏళ్ల డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా థెల్విగ్
- మెక్సికో దేశంలో మిస్ యూనివర్స్ పోటీలు
- విశ్వసుందరి కిరీటం కైవసం చేసుకున్న విక్టోరియా కెజార్ హెల్వింగ్
- డెన్మార్క్ దేశానికి బ్యూటీ పేజెంట్ లో ఇదే తొలి టైటిల్
డెన్మార్క్ అందాల భామ విక్టోరియా కెజార్ హెల్వింగ్ మిస్ యూనివర్స్-2024 కిరీటం కైవసం చేసుకుంది. ఈ డెన్మార్క్ బ్యూటీ వయసు 21 సంవత్సరాలు. అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ దేశానికి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది విశ్వసుందరిగా నిలిచిన విక్టోరియా థెల్విగ్ కు గతేడాది మిస్ యూనివర్స్ గా గెలిచిన షెన్నిస్ పలాసియస్ (నికరాగువా) కిరీటధారణ చేసింది.
ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ గా మెక్సికో సుందరి మరియా ఫెర్నాండా బెల్ ట్రాన్, సెకండ్ రన్నరప్ గా నైజీరియా ముద్దుగుమ్మ చిడిమ్మా అడెట్షినా ఎంపికయ్యారు.
కాగా, ఈ విశ్వసుందరి పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా (యూనివర్స్) రియా సింఘా టాప్-12లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది. ప్రాథమిక రౌండ్లలో రాణించినప్పటికీ, ఫైనల్ రౌండ్ చేరేందుకు ఆ ప్రతిభ సరిపోలేదు.
ఈసారి మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్-12లో ఏడుగురు లాటిన్ అమెరికా దేశాలకు చెందినవారే. ఈ అందాల పోటీలు మెక్సికో దేశంలో జరిగాయి.