బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. కోహ్లీని ఎలా అడ్డుకోవాలన్న దానిపై ఆసీస్‌కు మెక్‌గ్రాత్ కీలక సూచన

  • కోహ్లీ ఎమోషనల్ ఆటగాడన్న మెక్‌‌గ్రాత్
  • అతడిపై అదే మంత్రం ప్రయోగించాలని సూచన
  • న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైన కోహ్లీ ఒత్తిడిలో ఉన్నాడన్న దిగ్గజ క్రికెటర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 22 నుంచి జరగనున్న సిరీస్‌పై రెండు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఆస్ట్రేలియా దిగ్జజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తమ జట్టుకు కీలక సూచన చేశాడు. కోహ్లీపై ఎమోషనల్‌గా ఒత్తిడి తీసుకొస్తే పని సులభం అవుతుందని పేర్కొన్నాడు. 

కోహ్లీ ఈ ఏడాది టెస్టుల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచుల్లో అతడి సగటు 22.72 మాత్రమే. ఆస్ట్రేలియాలో అతడి సగటు 54.08 కంటే ఇది చాలా తక్కువ. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో భారత జట్టు 3-0తో దారుణంగా ఓటమి పాలైంది. ఈ సిరీస్‌లో కోహ్లీ 91 పరుగులు మాత్రమే చేశాడు. 

బొటనవేలికి గాయంతో తొలి టెస్టుకు శుభమన్ గిల్ దూరం కావడంతో కోహ్లీపై మరింత ఒత్తిడి పెరగనుంది. బౌన్సీ, పేసీ బెర్త్ పిచ్‌పై పరుగులు రాబట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కోహ్లీపైనే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీని అడ్డుకునేందుకు మెక్‌గ్రాత్ సొంత జట్టుకు విలువైన సలహా ఇచ్చాడు. కోహ్లీ ఎమోషనల్ ఆటగాడని, కాబట్టి అతడిని అలానే లొంగదీసుకోవాలని సూచించాడు. కోహ్లీ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాడని, అతడు కనుక రెండు మ్యాచుల్లో తక్కువ స్కోర్టు చేస్తే అందుకు అతడు బాధపడతాడని, అతడు ఎమోషనల్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. అతడు ఫామ్‌లో ఉంటే చెలరేగిపోతాడని, లేకుంటే కనుక కొంచెం ఇబ్బంది పడతాడని చెప్పాడు. 

ఆస్ట్రేలియాపై భారత్ హ్యాట్రిక్ టెస్ట్ సిరీస్ విజయాలు సాధించకుండా ఆపాలంటే ఆస్ట్రేలియా దూకుడు పెంచాలని మెక్‌గ్రాత్ భావిస్తున్నాడు. న్యూజిలాండ్‌పై 3-0తో ఓడిపోయిన తర్వాత బ్యాకప్ చేసుకునే అవకాశం ఉందని, కాబట్టి వారిపై ఒత్తిడి తేవడం ద్వారా అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నాడు. మెక్‌గ్రాత్ 21.64 సగటుతో 563 టెస్టు వికెట్లు సాధించాడు. 

పెర్త్‌లో తొలి టెస్టు తర్వాత మిగతా నాలుగు టెస్టులు అడిలైడ్ (పింక్‌బాల్ మ్యాచ్), బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. 1991/1992 సీజన్ తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఇదే. 


More Telugu News