త్వరలో... పుస్తకరూపంలో రజనీకాంత్ జీవితం

త్వరలో... పుస్తకరూపంలో రజనీకాంత్ జీవితం
  • రజనీకాంత్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు
  • రజనీకాంత్ ఆత్మకథను రాయనున్నారంటూ ప్రచారం 
  • ధృవీకరించని రజనీకాంత్ టీమ్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం కూలీ, జైలర్ మూవీ షూటింగ్‌లలో బిజీగా ఉన్న రజనీకాంత్ .. ఆ సినిమాలు పూర్తి అయిన తర్వాత తన ఆత్మకథ (ఆటో బయోగ్రఫీ) రాయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై రజనీకాంత్ టీమ్ నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందన రాలేదు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తను ధృవీకరించడం గానీ, ఖండించడం గానీ చేయలేదు. 

అయితే రజనీకాంత్ తన ఆత్మకథను రాయబోతున్నారు అన్న వార్తే అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. సూపర్ స్టార్‌గా ఎదిగినా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఎంతో మంది అభిమానులను రజనీకాంత్ సంపాదించుకున్నారు. ఆయనకు భారతదేశంలోనే కాక జపాన్ తదితర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ పేరుతో ఫ్యాన్స్ క్లబ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం చాలా మందికి రజనీకాంత్ సినీ కేరియర్ గురించి మాత్రమే తెలుసు కానీ, వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియవు. 

కాకపోతే బస్ కండక్టర్‌గా తొలుత జీవనాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఓ స్నేహితుడి సలహాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారని మాత్రం చాలా మందికి తెలుసు. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ రజనీకాంత్ నటించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా రజనీకాంత్ ఆత్మకథ రాస్తే అభిమానులకు మంచి గిఫ్ట్ అందుతుందని భావిస్తున్నారు. ఇక రజనీకాంత్ చివరిసారిగా వేట్టయన్ మూవీలో అభిమానులకు కనువిందు చేశారు.    


More Telugu News