టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
- 2024లో ముగిసిన టీమిండియా టీ20 క్రికెట్ షెడ్యూల్
- ఈ ఏడాది మొత్తం 26 మ్యాచ్‌లు ఆడి 24 విజయాలు సాధించిన భారత్
- ఒక ఏడాది అత్యధిక గెలుపు శాతం కలిగిన జట్టుగా అవతరణ
ప్రస్తుత ఏడాది 2024లో టీమిండియా టీ20 క్రికెట్ షెడ్యూల్ ముగిసింది. ఇటీవలే ఆడిన దక్షిణాఫ్రికా సిరీస్ చివరిది. ఈ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా 2024కి భారత టీ20 జట్టు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. ఈ ఏడాది భారత జట్టుకు, క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఎందుకంటే 11 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్-2024ను భారత్ ముద్దాడింది. అంతేకాదు ఈ సంవత్సరం జరిగిన ఐదు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లను గెలుచుకుంది.
మరో విశేషం ఏమిటంటే.. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు.
ఈ ఏడాది కేవలం రెండు టీ20 మ్యాచ్‌ల్లో మాత్రమే భారత జట్టు ఓడిపోయింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే భారత్‌ను ఒక్కోసారి ఓడించాయి. ఈ ఏడాది భారత్ మొత్తం 26 టీ20 మ్యాచ్‌లు ఆడగా రికార్డు స్థాయిలో 24 విజయాలు సాధించింది. ఇందులో రెండు సూపర్ ఓవర్ గెలుపులు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లను భారత్ ఓడించింది. మొత్తంగా ఈ ఏడాది అద్భుత రీతిలో విజయాలు సాధించిన టీమిండియా... పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో భారత్ గెలుపు శాతం 92.31గా ఉంది. 2018లో పాకిస్థాన్ ఆల్-టైమ్ బెస్ట్ 89.47 శాతం కంటే ఎక్కువగా భారత్ ఏడాది విజయాల శాతం నమోదయింది. 2018లో పాకిస్థాన్ 19 టీ20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధించింది.
టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ గెలుపు శాతం..
1. భారత్ - 92.31 శాతం (26 మ్యాచ్‌ల్లో 24 విజయాలు)
2. పాకిస్థాన్ - 89.47 శాతం (19 మ్యాచ్‌ల్లో 17 గెలుపులు)
3. ఉగాండా - 87.88 శాతం (33 మ్యాచ్‌ల్లో 29 విజయాలు)
4. పపువా న్యూగినియా- 87.5 శాతం (17 మ్యాచ్‌ల్లో 14 విజయాలు)
5. టాంజానియా - 80.77 శాతం (29 మ్యాచ్‌ల్లో 21 గెలుపులు).