గుడ్‌న్యూస్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆస్ట్రేలియా బయలుదేరనున్న స్టార్ పేసర్
- రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున అదరగొట్టిన పేసర్ మహ్మద్ షమీ
- మధ్యప్రదేశ్‌పై బెంగాల్ గెలుపులో కీలక పాత్ర వహించిన వైనం
- కెప్టెన్ రోహిత్‌తో కలిసి వెళ్లి టీమిండియాలో కలవనున్నట్టు కథనాలు
- గాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ
- కోలుకున్నాక ఇటీవలే ప్రాక్టీస్ మొదలు పెట్టిన భారత స్టార్ బౌలర్
ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టగల భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ సంచలనాత్మక రీతిలో టీమిండియాలోకి పునరాగమనం చేయబోతున్నాడు. చీలమండ గాయం కారణంగా దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఈ పేసర్... ఇటీవల రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. మధ్యప్రదేశ్‌పై బెంగాల్ తరపున ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షమీ 43.2 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 36 పరుగులు కూడా సాధించాడు. షమీ రాణించడంతో బెంగాల్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనతో మహ్మద్ షమీ వీలైనంత త్వరగా భారత టెస్టు జట్టులో కలుస్తాడని తెలుస్తోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం షమీని జట్టులోకి తీసుకోవడానికి అంతా సిద్ధమైందని ‘దైనిక్ భాస్కర్’ కథనం పేర్కొంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి షమీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడని, వారిద్దరూ మొదటి మ్యాచ్‌కు ముందే జట్టులో చేరవచ్చని పేర్కొంది. అయితే పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ తర్వాతే షమీని తుది జట్టులోకి తీసుకోనున్నారని తెలిపింది.
కాగా షమీ అద్భుత ప్రదర్శనతో రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ చిరస్మరణీయ విజయం సాధించింది. గత 15 ఏళ్లుగా బెంగాల్ టీమ్‌పై మధ్యప్రదేశ్ టీమ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. అలాంటిది ఈసారి విక్టరీ సాధించడంలో షమీ ముఖ్య పాత్ర పోషించాడు. 338 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన మధ్యప్రదేశ్ జట్టు 326 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ టీమ్‌లో ఉండడం, వికెట్లు తీయడం బెంగాల్ ఆటగాళ్లకు నైతిక బలంగా మారింది.