నాగచైతన్య, శోభితల పెళ్లి కార్డు చూశారా!

  • డిసెంబరు 4న హైదరాబాద్‌లో పెళ్లి ఫిక్స్‌! 
  • ఇరు కుటుంబాల్లో మొదలైన పెండ్లి సందడి 
  • సింపుల్‌గా నాగచైతన్య, శోభితల పెళ్లి పత్రిక
నాగచైతన్య, సమంత ఈ జంట కొంత కాలం క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. డైవర్స్‌ తరువాత సమంత సినిమాలతో పాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. నాగచైతన్య కూడా సినిమాలతో బిజీగా వున్నారు. అయితే నాగచైతన్య మాత్రం   మళ్లీ పెళ్లికి సిద్దమయ్యాడు. త్వరలోనే ఆయన కథానాయిక శోభిత ధూళిపాళను వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 

గత కొంత కాలం నుంచి స్నేహంగా ఉంటున్న ఈ జంటకు ఇటీవల ఇరువురి కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ తరువాత నాగచైతన్య-శోభిత జంట ఇటీవల కొన్ని పబ్లిక్‌ ఫంక్షన్స్‌కు అటెండ్‌ అయ్యారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇక ఈ జంట వివాహం డిసెంబర్‌ 4న అంగ రంగ వైభవంగా జరగనుంది. 

ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక పెళ్లి మండపం సెట్‌ వేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఆల్‌ రెడీ  కొంత మంది స్నేహితులకు, బంధుమిత్రులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ను పంపిస్తున్నారు. అంతేకాదు అక్కినేని వారి ఇంట ఆల్‌రెడీ పెళ్లి పనులు, పెళ్లి సందడి మొదలైందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా కొనసాగుతున్నాయని తెలిసింది. 

ఇంతకు ముందే శోభిత ధూళిపాళ ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. నాగచైతన్య పంచిన పెళ్లి కార్డు ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ కార్డ్‌ చాలా సింపుల్‌గా ఉందని అంటున్నారు నెటిజన్లు.  

 ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'తండేల్‌' చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌, బన్నీవాస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

.


More Telugu News