హైదరాబాదులో నటి కస్తూరి అరెస్ట్
- ఇటీవల తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి
- తమిళనాడులో కస్తూరిపై కేసులు నమోదు
- ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- పరారీలో కస్తూరి
- చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం
తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రజలపై తీవ్ర విమర్శలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు నేడు హైదరాబాదులో అరెస్ట్ చేశారు. 300 ఏళ్ల కిందట తమిళనాడు రాజుల అంతఃపురాల్లో స్త్రీలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు ప్రజలు ఇప్పుడు తమదే తమిళ జాతి అని చెప్పుకుంటున్నారని కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో కస్తూరిపై తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.
కస్తూరి క్షమాపణలు చెప్పినప్పటికీ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిలో ఆగ్రహజ్వాలలు చల్లారలేదు. అటు, కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో, పరారీలో ఉన్న కస్తూరిని హైదరాబాదులోని నార్సింగిలో చెన్నై ఎగ్మోర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆమె కోసం చెన్నై నుంచి ప్రత్యేక పోలీసు బృందం హైదరాబాద్ వచ్చింది. కస్తూరిని అరెస్ట్ చేసిన అనంతరం ఆమెను చెన్నై తరలిస్తున్నారు.