వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లకు 41ఏ నోటీసులు
- సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
- ఇటీవల వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్
- పరారీలో వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లు
- నోటీసులు వారి ఇళ్లకు అతికించి... వారి కోసం గాలిస్తున్న పోలీసులు
వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి, కో-కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్ లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
వివేకానందరెడ్డి, సునీత, వరకుమార్, నిశాంత్ ల ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. నేడు పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో ప్రశ్నించేందుకు విచారణకు రావాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆ నలుగురి ఇళ్లకు నోటీసులు అంటించిన పోలీసులు... వారి కోసం గాలిస్తున్నారు.