ఏపీలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టులు... ఎక్కడంటే!

  • ఏపీలో నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు
  • ఫీజిబిలిటీ స్టడీ కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వం
  • రూ.1.92 కోట్ల నిధుల విడుదల
  • త్వరగా అధ్యయనం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు 
ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ మేరకు నిధులు కూడా కేటాయించింది. ఫీజిబిలిటీ అధ్యయనం కోసం ప్రభుత్వం రూ.1.92 కోట్లు విడుదల చేసింది. 

కుప్పం, శ్రీకాకుళం (పలాస), నాగార్జునసాగర్ (సమీపంలో), ఒంగోలు, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కుప్పంలో 1,501 ఎకరాలు, నాగార్జునసాగర్ సమీపంలో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడెం వద్ద 1,123 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 1,383 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. 

నిధులు కేటాయించిన నేపథ్యంలో, సాధ్యమైనంత త్వరగా ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తిచేయాలని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది. 


More Telugu News