శంషాబాద్ లో షార్జా విమానానికి బాంబు బెదిరింపు
- ఫ్లైట్ ఎక్కి తన వద్ద బాంబ్ ఉందంటూ ఓ వ్యక్తి కేకలు
- సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేసిన సిబ్బంది
- గత కొన్నిరోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. నగరం నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత సదరు ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందంటూ కేకలు వేశాడు. విమానాశ్రయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతనిని, లగేజీని తనిఖీ చేశారు. కానీ ఎలాంటి బాంబును గుర్తించలేదు.
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. మొదట వారిని కిందకు దించారు. విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. నిన్న నాగపూర్ విమానానికి కూడా ఓ బాంబు బెదిరింపు వచ్చింది. గత కొన్నిరోజులుగా పదులు, వందల సంఖ్యలో పేక్ బాంబు బెదిరింపులు వస్తున్నాయి.