పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం... బయటకు పరుగులుతీసిన అపార్ట్‌మెంట్ వాసులు!
- గోల్డెన్ ఓరియో ఆపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు ప్లాట్‌లో ప్రమాదం
- విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు
- గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్ధం
హైదరాబాద్‌లోని మణికొండ పరిధి పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. మంటలు చెలరేగి... ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలింది.
ఒక్కసారిగా మంటలు, భారీ శబ్ధం రావడంతో అపార్ట్‌మెంట్‌లోని వారంతా బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన ఫ్లాట్‌లోని ఐదుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చారు. ప్రమాదంలో ఈ ఫ్లాట్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.50 లక్షల విలువైన ఆస్తి దగ్ధమైనట్లు బాధితులు చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
ప్రమాదస్థలికి ఫైరింజన్ వెంటనే వచ్చినప్పటికీ లోపలకు వెళ్లడానికి దారిలేక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అపార్ట్‌మెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో ఫైరింజన్ లోనికి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో భవన నిర్వాహకులు, యాజమాన్యంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.