29న ఏపీకి ప్రధానమంత్రి మోదీ రాక?
- విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశం
- ప్రధాని ఆధ్వర్యంలో పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం
- అసెంబ్లీలో వెల్లడించిన సీఎం చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 29న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు నిన్న (శుక్రవారం) అసెంబ్లీలో వెల్లడించారు.
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్ట్‌తో పాటు విశాఖ రైల్వేజోన్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ సభ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టింది. బహిరంగ సభకు వేదిక కాబోతున్న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్‌ను జిల్లా అధికారులు నిన్న (శుక్రవారం) పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్, ఇతర అధికారులు మైదానానికి వెళ్లి చూశారు.