ఉత్తర తెలంగాణకు పొన్నం ప్రభాకర్ 'గుడ్ న్యూస్'
- కరీంనగర్ ప్రజలు పడుతున్న కష్టాలు త్వరలో తీరనున్నాయని వెల్లడి
- త్వరలో ఎలివేటర్ కారిడార్ నిర్మించనున్నట్లు వెల్లడి
- ప్యారడైజ్ నుంచి శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మాణం
ఉత్తర తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ 'గుడ్ న్యూస్' చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్నో ఏళ్ళుగా ఉత్తర తెలంగాణ ప్రజలు... మరీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు పడుతున్న కష్టాలు త్వరలో తీరనున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లు త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటర్ కారిడార్ రాజీవ్ రహదారితో అనుసంధానం, ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫార్మ్ రోడ్ (జాతీయ రహదారి 44) త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. కంటోన్మెంట్లో భూమి సేకరించిన నేపథ్యంలో ఈక్వాల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కంటోన్మెంట్ అభివృద్ధిలో భాగంగా 303.62 కోట్లు ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదల చేసినట్లు తెలిపింది.