మేనల్లుడికి విషెస్ తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం
- మంగళగిరి డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసిన మేనల్లుడు సాయి దుర్గా తేజ్
- పవన్ కల్యాణ్‌కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్న సాయి తేజ్
- సినీ హీరోగా సాయి తేజ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపిన పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం తన మేనల్లుడు, మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌కు అభినందనలు తెలిపారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సాయి దుర్గా తేజ్ మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని పవన్ కల్యాణ్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్‌కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
నటన పట్ల ఎంతో తపనతో తేజ్ ఎదుగుతూ వస్తున్నాడని పవన్ పేర్కొన్నారు. నటుడిగా సినీ రంగంలోకి వచ్చిన నాటి నుంచి సహనటులు, సాంకేతిక నిపుణులతో సాయి తేజ్ ఎంత గౌరవ మర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడన్నారు. తను ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు సైతం ఎంతో ఆత్మవిశ్వాసం చూపించాడని అన్నారు. నుంచి తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్య పరుస్తున్నాడని అన్నారు.
సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు, పోస్టులు పెట్టడంపై వేగంగా స్పందించిన తీరు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియజేస్తుందన్నారు. అలానే ఇటీవల విజయవాడలో భారీ వర్షాలు, వరద ముంపు సంభవించిన తరుణంలో తన వంతు బాధ్యతగా స్పందించాడన్నారు. సినీ హీరోగా మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.