తులసీ గబ్బార్డ్ కు కీలక పదవిని కట్టబెట్టిన ట్రంప్
- ఇంటెలిజెన్స్ చీఫ్ గా తులసి నియామకం
- మాజీ డెమోక్రాట్ నేతను తన టీంలో చేర్చుకున్న ట్రంప్
- ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోకు విదేశాంగ శాఖ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ తన టీంను నియమించుకుంటున్నారు. తన అనుకూలురు, మద్దతుదారులకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులను ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నారు.
ఈ క్రమంలో మాజీ డెమోక్రాట్ లీడర్ తులసీ గబ్బార్డ్ ను ట్రంప్ కీలక పదవిలోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆమెను ఎంపిక చేశారు. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోకు విదేశాంగ శాఖ బాధ్యతలను కట్టబెట్టారు. మరోవైపు, అధికార మార్పిడిపై చర్చించేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఆహ్వానంతో బుధవారం ట్రంప్ వైట్ హౌస్ కు వెళ్లారు. ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ కు బైడెన్ అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు అధికార మార్పిడిపై చర్చించినట్లు సమాచారం.