ఏ క్షణంలోనైనా అరెస్ట్ అంటూ ప్రచారం... కేటీఆర్ ఇంటికి అర్ధరాత్రి వచ్చిన అభిమానులు
- కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు
- బయటకు వచ్చి అభిమానులతో కేటీఆర్ కరచాలనం
- కేటీఆర్ అరెస్ట్ అవుతారని నిన్న కోమటిరెడ్డి జోస్యం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన నివాసానికి చేరుకొని జై కేటీఆర్... జై కేటీఆర్... కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బయటకు వచ్చిన కేటీఆర్ వారితో కరచాలనం చేశారు.
కేటీఆర్ అరెస్టవుతారన్న మంత్రి కోమటిరెడ్డి
ఫార్ములా-ఈ, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఏ రోజైనా జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు అరెస్ట్ భయం పట్టుకుందని, అందుకే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని ఎద్దేవా చేశారు. అంతకుముందు కూడా పలువురు మంత్రులు... కేటీఆర్ పేరును ప్రస్తావించకుండా అరెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు.