నటి శ్రీరెడ్డిపై ఏపీలో కేసు నమోదు
- రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- చంద్రబాబు, కుటుంబ సభ్యులపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు
- పవన్ కల్యాణ్ గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెట్టారని కూడా ఫిర్యాదు
నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వీడియోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదైంది. మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమహేంద్రవరం గ్రామీణంలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో నిన్న ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు, అనంతపురం నగరానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని బుధవారం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ సాయినాథ్‌కు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లోనూ ఇంకొక ఫిర్యాదు నమోదయింది.