ఏపీలో గత ప్రభుత్వానికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించిన కాగ్
- 2023లో ఆర్బీఐ వద్ద ఏపీ నిల్వ రూ.19 కోట్ల లోటు ఉందన్న కాగ్
- 2024లో ఆ లోటు రూ.33 కోట్లు అని వెల్లడి
- 2022-23లో ప్రభుత్వ అప్పులు రూ.4,86,151 కోట్లు అని స్పష్టీకరణ
భారత ప్రభుత్వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఏపీలో గత ప్రభుత్వానికి సంబంధించిన కీలక వ్యవహారాలను వెల్లడించింది. 2023 ఏప్రిల్ నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద రాష్ట్ర నిల్వ రూ.19 కోట్ల లోటు ఉందని తెలిపింది. 2024 మార్చిలో ఆర్బీఐ వద్ద రాష్ట్ర నిల్వ రూ.33 కోట్ల లోటు ఉందని పేర్కొంది.
ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వలే లేవని కాగ్ స్పష్టం చేసింది. 2022-23లో ప్రభుత్వ అప్పులు రూ.4,86,151 కోట్లు అని వెల్లడించింది. ప్రభుత్వ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 34 శాతంగా ఉన్నాయని వివరించింది.
2023-24లో రూ.2,23,004 కోట్లు మేర ప్రభుత్వ గ్యారెంటీలు ఇచ్చారని... రూ.69,626 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ చేశారని కాగ్ తెలిపింది.
కాగ్ వెల్లడించిన ఇతర అంశాలు...

- 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారానే వచ్చాయి.
- గత ప్రభుత్వ హయాంలో రూపాయిలో 30 పైసలు రుణాలు తెచ్చారు.
- రూపాయిలో... గ్రాంట్ ఇన్ ఎయిడ్ 14 పైసలు, పన్నేతర అంశాల ద్వారా 3 పైసలు, రుణాల రికవరీ ద్వారా 1 పైసా ఆర్జించారు.
- రూపాయిలో 15 పైసలు జీతాల కోసం ఖర్చు చేశారు.
- డీబీటీలకు 13 పైసలు, వడ్డీలకు 12 పైసలు చెల్లించారు.