మాజీ మంత్రి విడదల రజనిపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఐ-టీడీపీ నేత

  • తనను అక్రమ కేసులతో వేధించారన్న పిల్లి కోటేశ్వరరావు
  • మార్ఫింగ్ ఫొటోలు పెట్టినట్టు తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడి
  • అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని వెల్లడి
వైసీపీ మహిళానేత, మాజీ మంత్రి విడదల రజని చిక్కుల్లో పడ్డారు. మాజీ మంత్రి విడదల రజని, అప్పటి చిలకలూరిపేట అర్బన్ సీఐ తనపై అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడ్డారంటూ ఐ-టీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. 

సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టినట్టు తప్పుడు కేసులతో వేధించారని, పోలీస్ స్టేషన్ లో తనను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారని పిల్లి కోటేశ్వరరావు తన ఫిర్యాదులో ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.


More Telugu News