ఝార్ఖండ్ లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్
- ఝార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్
- ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు
- నేడు తొలి దశలో 43 స్థానాలకు ఎన్నికలు
- మధ్యాహ్నం ఒంటి గంటకు 46.25 శాతం పోలింగ్
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేడు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా... నేడు మొదటి దశలో 43 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 43 నియోజకవర్గాల్లో 683 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 46.25 శాతం పోలింగ్ నమోదైంది.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.
ఇక, ఝార్ఖండ్ లోని మిగిలిన 38 స్థానాల్లో ఈ నెల 20న రెండో విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు.
గతంతో పోల్చితే ఈసారి ఝార్ఖండ్ లో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా ఉంది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అధికారం నిలుపుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుండగా... ఝార్ఖండ్ లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది.