మీడియాకు క్షమాపణలు చెప్పిన హీరో సూర్య.. కారణమిదే!
- సూర్య, శివ కాంబినేషన్లో 'కంగువా'
- ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా
- జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న మేకర్స్
- ఈ క్రమంలో తాజాగా ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించిన చిత్రబృందం
- ఈ సమావేశానికి ఆలస్యంగా రావడంతో మీడియాకు సారీ చెప్పిన సూర్య
హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు శివ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం 'కంగువా'. ఈ నెల 14న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రబృందం ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో సూర్య మీడియాకు క్షమాపణ చెప్పి, అందరినీ ఆశ్చర్యపరిచారు.
దానికి కారణం.. ఆయన ఈ ప్రెస్‌మీట్‌కు ఆలస్యంగా వెళ్లడమే. ముంబయి ప్రెస్‌మీట్‌కు బయలుదేరిన సూర్య సమయానికి అక్కడకు చేరుకోలేదు. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వెళ్లారు. దాంతో సూర్య మీడియాకు సారీ చెప్పారు.
ఈ ప్రెస్మీట్లో సూర్య మాట్లాడుతూ... "ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యిందని సాకులు చెప్పను. మీ అందరి సమయానికి నేను విలువనిస్తాను. అయితే దీన్ని నేను నియంత్రించలేకపోయా" అని సూర్య అన్నారు. ఇక ఈ మీడియా సమావేశంలో 'కంగువా' సినిమాపై పలు ప్రశ్నలకు సూర్య సమాధానమిచ్చారు.