ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి బంగారం చోరీ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్.. వీడియో ఇదిగో!
- నిజామాబాద్ నుంచి వరంగల్ వస్తున్న బస్సులో ఘటన
- ప్రయాణికురాలి బ్యాగ్ జిప్ తెరిచి నగలు కాజేసి జేబులో పెట్టుకున్న డ్రైవర్
- ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఘటన వెలుగులోకి
- నిందితుడు అద్దె బస్సు డ్రైవర్ అని.. విధుల నుంచి తొలగించామని చెప్పిన ఆర్టీసీ అధికారులు
ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి బంగారం చోరీ చేశాడో ఆర్టీసీ బస్ డ్రైవర్. అతడు దొంగతనం చేస్తుండగా ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. దీంతో ఆ డ్రైవర్ ఉద్యోగం కోల్పోయాడు.
నిజామాబాద్ నుంచి వరంగల్ వస్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిందీ ఘటన. ఆర్టీసీలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు.
సాధారణంగా ఎవరైనా ప్రయాణికుడు బస్సులో తమ లగేజీ మర్చిపోతే దానిని బస్సు డిపోలో అప్పగిస్తారు. వారు ప్రయాణికుడి వివరాలు కనుక్కుని అందజేస్తారు. అయితే, ఈ బస్సు డ్రైవర్ మాత్రం ఆ పనిచేయకుండా అందులోని బంగారు నగలను కాజేశాడు. అయితే, ఓ ప్రయాణికుడు ఈ ఘటనను చిత్రీకరించడంతో డ్రైవర్ బుకాయించాడు. బ్యాగు నుంచి బంగారం కిందపడిందని పేర్కొన్నాడు. అయితే, ప్రయాణికులు గట్టిగా ప్రశ్నించే సరికి తానే తీసినట్టు అంగీకరించాడు.