అత్యంత శక్తిమంతులైన ముఖ్యమంత్రులలో చంద్రబాబు నంబర్ వన్
- చంద్రబాబు తర్వాత నితీశ్‌కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఎంకే స్టాలిన్, మమతాబెనర్జీ
- అత్యంత శక్తిమంతులైన టాప్ టెన్ నేతల్లో చంద్రబాబుకు ఐదో స్థానం
- మొదటి 4 ర్యాంకుల్లో ప్రధాని మోదీ, మోహన్ భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ
- ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని ప్రశంస
- ఈ మేరకు ‘ఇండియా టుడే’ కథనం
ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా శక్తిమంతులైన టాప్ టెన్ నేతల్లో చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు.
ఇక అత్యంత శక్తిమంతులైన సీఎంలలో చంద్రబాబు తర్వాత బీహార్, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఎంకే స్టాలిన్, మమతాబెనర్జీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఉన్నారు.
జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్ పక్షిలా పునర్జన్మనెత్తి.. అధికారం చేజిక్కించుకున్నారని ‘ఇండియా టుడే’ కథనం అభివర్ణించింది. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చారిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని ప్రశంసించింది. ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని పేర్కొంది.
అలాగే జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడి టీడీపీని పతనావస్థ నుంచి విజయతీరానికి చేర్చారని మంగళవారం నాటి తన ప్రత్యేక కథనంలో చంద్రబాబుకు ‘ఇండియా టుడే’ కితాబునిచ్చింది. ఇవాళ చంద్రబాబు భారత్‌లోనే అత్యంత సీనియర్ సీఎం అని తెలిపింది.
"ప్రస్తుతం కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సంకటం తప్పదు. అందుకే పాలక ఎన్‌డీఏలో ఆయన కీలకం అయ్యారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చాలా ఈజీగా చేరుకునే అవకాశం ఉంది.
ఇటీవల విజన్-2047 డాక్యుమెంట్ ను చంద్రబాబు ఆవిష్కరించారు. 15 శాతం వృద్ధి రేటుతో 2047 కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు.
ఇక కార్పొరేట్లతో స్నేహభావంతో మెలిగే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజనెస్ (ఐఎస్‌బీ) ఏర్పాటుకు చొరవ చూపించారు" అని ‘ఇండియా టుడే’ తన కథనంలో రాసుకొచ్చింది.