కొత్త ఫోన్ విడుదల చేసిన వివో... ధర రూ.10 వేల లోపే!
- భారత మార్కెట్‌లో వివో వై18టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం
- ధర రూ.9,499గా ప్రకటించిన కంపెనీ
- బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు అందించిన వివో
బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నవారికి మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం వివో గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.10 వేల లోపు కంటే తక్కువ ధరతో వివో వై18టీ స్మార్ట్‌ఫోన్‌ను భారత విపణిలో విడుదల చేసింది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, యూనిసాక్ టీ612 చిప్‌సెట్, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ఆకర్షణీయమైన ఫీచర్లను కంపెనీ అందించింది.
వివో వై18టీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,499గా ఉంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ రంగులలో ఈ ఫోన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. వివో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లపై కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై పనిచేస్తుంది. 720x1612 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 840 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ర్యామ్‌ను 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే ప్రత్యేక ఫీచర్ ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.
కెమెరా విషయానికి వస్తే వివో వై18టీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50-ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.2, ఎంఎఫ్ రేడియో, జీపీఎస్, గ్లోనాస్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.