కాంగ్రెస్ సాధ్యంకాని హామీలు ఇచ్చి మొండిచేయి చూపింది: తమ్మినేని వీరభద్రం

  • ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో కాంగ్రెస్‌కే తెలియదని విమర్శ
  • రైతు భరోసా, రుణమాఫీ చేయలేదని మండిపాటు
  • ఏ మంత్రి ఏం మాట్లాడతాడో అర్థం కావడం లేదన్న వీరభద్రం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని... అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో కాంగ్రెస్‌కే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ వంటి హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వంలో ఏ మంత్రి ఏం మాట్లాడతాడో అర్థం కావడంలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 11 నెలలైనా ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మైనార్టీ నాయకులను అణిచివేస్తోందని ధ్వజమెత్తారు. సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కులగణన కోసమే సర్వే చేయాలన్నారు.


More Telugu News