రియల్ స్టార్ డమ్ కు ఆమిర్ ఖాన్ నిర్వచనం ఇదే!

  • థియేటర్ కు ప్రేక్షకులను రప్పించడమే స్టార్ డమ్ కు కొలమానం అన్న ఆమిర్
  • థియేటర్ హౌస్ ఫుల్ అయితే ఆ నటుడు స్టార్ కిందే లెక్క అని వెల్లడి
  • ప్రేక్షకులను రప్పించలేకపోతే సినిమాలు తీయడం ఎందుకని వ్యాఖ్యలు
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్టార్ డమ్ కు నిర్వచనం చెప్పారు. ఓ థియేటర్ కు ఎంతమంది ప్రేక్షకులను రప్పించగలరన్నదే రియల్ స్టార్ డమ్ కు కొలమానం అని తెలిపారు. ఓ హాలీవుడ్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"ఓ థియేటర్ లో ఎన్ని సీట్లు నింపగలరన్నదానిపై స్డార్ డమ్ ఆధారపడి ఉంటుంది. సినిమా థియేటర్ హౌస్ ఫుల్ అయితే ఆ నటుడు స్టార్ కిందే లెక్క. మరో రకం స్టార్లు కూడా ఉంటారు. వీళ్లకు అభిమానులు ఉంటారు. అయితే, వీరు తమ అభిమాన నటుడ్ని ప్రేమిస్తారు కానీ, థియేటర్ కు వచ్చి అతడి సినిమాను చూడరు. థియేటర్ కు ప్రేక్షకులను రప్పించలేని వీళ్లను కూడా కొన్నిసార్లు స్టార్లు అని పిలుస్తుంటాం" అని ఆమిర్ ఖాన్ వివరించారు. 

"ఓ నిర్మాతగా నాకు అర్థమైంది ఏంటంటే... ఒకవేళ నేను ఓ సినిమా తీస్తున్నానంటే తప్పకుండా ఓ స్టార్ ను హీరోగా పెట్టుకుంటాను. ఎందుకంటే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించాలి కదా! ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేని నటులతో సినిమాలు తీయడం ఎందుకు? అందుకే ఓ స్టార్ గా, ఓ నటుడిగా ఛరిష్మా ఉన్న వారికే నా ఓటు. భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నప్పుడు స్టార్ అవసరం ఎంతో ఉంటుంది" అంటూ ఆమిర్ ఖాన్ వివరించారు.


More Telugu News