ప్రియాంక గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఎల్‌డీఎఫ్
- కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఎల్‌డీఎఫ్
- మతపరమైన ప్రదేశాలను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు
- ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఈసీకి సమర్పించిన ఎల్‌డీఎఫ్
వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ వాద్రాపై ఎల్‌డీఎఫ్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వయనాడ్ లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె మతపరమైన ప్రదేశాలను దుర్వినియోగం చేశారని ఎల్‌డీఎఫ్ ఫిర్యాదు చేసింది. తద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది.
వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 10న ప్రియాంకాగాంధీ ఓ చర్చిలో ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎల్‌డీఎఫ్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఆ ఫొటోలు, వీడియోల్లో ప్రియాంకాగాంధీతో పాటు ఎమ్మెల్యే, కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధిఖీ, వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్డీ అప్పచన్ ఉన్నారు.