ఓటీటీ: భార్యను మర్డర్ చేసిన ఓ గుమస్తా కథగా 'గుమస్తాన్' మూవీ!

  • మలయాళ మూవీగా 'గుమస్తాన్'
  • సెప్టెంబర్ 27న విడుదలైన సినిమా
  • థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు  
  • నవంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మొదలైన స్ట్రీమింగ్
  • త్వరలో తెలుగులోను అందుబాటులోకి రానున్న కంటెంట్

మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. ఈ తరహా కంటెంట్ కి ఓటీటీ వైపు నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మలయాళం నుంచి 'గుమస్తాన్' అనే ఓ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ముజఫిర్ అబ్దుల్లా నిర్మించిన ఈ సినిమాకి, అమల్ కె జోబీ దర్శకత్వం వహించాడు.

ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్టీఫెన్ దేవస్సి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, జైస్ జోస్ .. షాజూ శ్రీధర్ .. దిలీష్ పోతన్ .. రోనీ డేవిడ్ రాజ్ .. కైలాష్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

పల్లి పాదన్ (జైస్ జోస్) అనే ఒక వ్యక్తి ఓ అడ్వకేట్ దగ్గర గుమస్తాగా పనిచేస్తూ ఉంటాడు. అస్తమాను అతను భార్యతో గొడవపడుతూ ఉంటాడు. ఓ రోజున అతను భార్యతో తగవు పడుతూ ఉండగా పనిమనిషి చూస్తుంది. ఆ మరునాడు పనికి వచ్చిన ఆమెకి, యజమాని భార్య కనిపించదు. దాంతో ఆమెకి అనుమానం కలుగుతుంది. ఫలితంగా పోలీసులు రంగప్రవేశం చేస్తారు. భార్యను మర్డర్ చేసిన ఆ గుమస్తా, పోలీసులను ఎలా ముప్పతిప్పలు పెట్టాడనేది కథ.



More Telugu News