కోహ్లి, సచిన్‌లను వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్.. అద్భుతమైన ఫీట్ నమోదు!
- వన్డేల్లో 8 సెంచరీలు సాధించిన రెండవ పిన్న వయస్కుడిగా రహ్మానుల్లా గుర్బాజ్
- 22 సంవత్సరాల 357 రోజుల వయసులో 8వ వన్డే శతకం బాదిన గుర్బాజ్
- సచిన్‌ను అధిగమించి రెండో స్థానంలో నిచిలిన ఆఫ్ఘన్ క్రికెటర్
- ఈ జాబితాలో అగ్రస్థానంలో డి కాక్ (22 సంవత్సరాల 312 రోజులు)
ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 8 సెంచరీలు సాధించిన రెండవ పిన్న వయస్కుడిగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ అద్భుతమైన ఫీట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాబర్ ఆజాంలను గుర్బాజ్ అధిగమించాడు.
గుర్బాజ్ 22 సంవత్సరాల 357 రోజుల వయసులో తన 8వ వన్డే శతకం బాదాడు. దీంతో సచిన్ టెండూల్కర్ (22 సంవత్సరాల 357 రోజులు) ను వెనక్కి నెట్టి గుర్బాజ్ రెండో స్థానానికి ఎగబాకాడు. కాగా, ఈ జాబితాలో మొదటి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ ఉన్నాడు. ఈ ఫీట్ నమోదు చేసినప్పుడు అతని వయసు 22 సంవత్సరాల 312 రోజులు మాత్రమే.
ఇక ఈ మైలురాయిని విరాట్ కోహ్లీ 23 ఏళ్ల 27 రోజుల వయసులో సాధించాడు. ప్రస్తుతం అతడు మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే 23 ఏళ్ల 280 రోజుల వయసులో 8వ వన్డే శతకం నమోదు చేసిన పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం నాలుగో స్థానంలో ఉన్నాడు.
కాగా, షార్జాలో బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో గుర్బాజ్ 120 బంతులు ఎదుర్కొని 101 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా ఆఫ్ఘనిస్థాన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. అలాగే వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.
ఇక వన్డేల్లో ఆఫ్ఘనిస్థాన్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా గుర్బాజ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత మహ్మద్ షాజాద్ (6) ఉన్నాడు. సోమవారం గుర్బాజ్ నమోదు చేసిన శతకం బంగ్లాదేశ్‌పై అతనికి మూడవది.