5 కోట్లతో 50 కోట్లు రాబట్టిన మలయాళ బ్లాక్ బస్టర్ .. తెలుగులోనూ స్ట్రీమింగ్!
- మలయాళంలో రూపొందిన 'కిష్కింద కాండం'
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
- భారీ వసూళ్లను నమోదు చేసిన సినిమా
- ఈ నెల 19 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
మలయాళంలో ఖర్చు తక్కువ .. కథాబలం ఎక్కువ అనిపించే సినిమాలు వస్తుంటాయి. అలా చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమాగా ' కిష్కింద కాండం' కనిపిస్తుంది. అసిఫ్ అలీ - అపర్ణ బాలమురళి - విజయ్ రాఘవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 12వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది.
కేవలం 5 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మొత్తాలను కొల్లగొట్టిన అతికొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచింది. దినిజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ నెల 19 నుంచి ఐదు భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు హాట్ స్టార్ ప్రకటించింది.
కథలోకి వెళితే .. కోతులు ఎక్కువగా ఉండే గ్రామం అది. కొంతకాలంగా ఆ గ్రామంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ గ్రామానికి చెందిన అజయన్ (అసిఫ్ అలీ)కి పెళ్లి అవుతుంది .. ఒక కొడుకు కూడా ఉంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా అతనికి అపర్ణ (అపర్ణ బాలమురళి)తో మరో వివాహమవుతుంది. వారి పెళ్లి జరిగిన కొన్ని రోజులకు ఆ పిల్లాడు అదృశ్యమవుతాడు. ఆ పిల్లాడు ఏమైపోయాడు? అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి వలన అజయన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు అనేది కథ.