వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్
- రవీంద్రారెడ్డిని కడప జైలుకు తరలించిన పోలీసులు
- కడప రిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు న్యాయమూర్తి ఆదేశం
- మిగిలిన ఇద్దరు నిందితులకు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాలని చెప్పిన న్యాయమూర్తి
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. కూటమి నేతలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై రవీంద్రారెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి అనే నిందితులను నిన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నిందితులను ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి ఎదుట పోలీసులు హజరుపర్చారు. విచారణ అనంతరం రవీంద్రారెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
విచారణ సమయంలో తనను తీవ్రంగా కొట్టారంటూ పోలీసులపై న్యాయమూర్తికి రవీంద్రారెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో ఉదయం పది గంటలకు కడప రిమ్స్ ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం పోలీసులు రవీంద్రారెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప జైలుకు తరలించారు. అయితే రవీంద్రారెడ్డితో పాటు అరెస్టు చేసిన నిందితులు సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలివేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.