ముగిసిన విస్తారా ఎయిర్ లైన్స్ కథ!
- గత పదేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులతో ప్రయాణికులకు సేవలు అందించిన విస్తారా
- ఎయిర్ ఇండియా సంస్థలో విలీనమైన విస్తారా గ్రూపు
- ముంబయి – ఢిల్లీ, ఢిల్లీ – సింగపూర్ మధ్య చివరి సర్వీసు నడిపిన విస్తారా ఎయిర్ లైన్స్
ప్రముఖ పౌర విమానయాన సంస్థ విస్తారా శకం ఇక ముగిసింది. గత పదేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు విమాన సేవలు అందించిన విస్తారా గ్రూపు ఎయిర్ ఇండియా సంస్థలో విలీనం అయింది. ముంబయి - ఢిల్లీ, ఢిల్లీ - సింగపూర్ మధ్య సోమవారం రాత్రి విస్తారా తన చివరి సర్వీసులను నడిపింది.
ముంబయి నుంచి ఢిల్లీకి విస్తారా యూకే 986 విమానం సోమవారం రాత్రి గం. 10.50కి బయలుదేరగా, ఢిల్లీ నుంచి సింగపూర్ కు యూకే 115 విమానం రాత్రి గం. 11.45 వెళ్లింది. విస్తారా ఎయిర్ లైన్స్ విమాన కోడ్ యూకే స్థానంలో ఇక ఏఇ 2 కొత్త కోడ్ వస్తుంది.
2015 జనవరి 9న విస్తారా తన విమాన సేవలను ప్రారంభించింది. ఆ రోజు నుంచి ఢిల్లీకి మొదటి విమాన సర్వీసును నడపగా, తన చివరి సర్వీసును కూడా అదే రూట్‌లో నడపడం ఆసక్తికర విషయం. విస్తారా ఎయిర్ లైన్స్‌లో టాటా గ్రూపుకు 51 శాతం, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతం వాటాలు ఉన్నాయి.
కొంత కాలం క్రితం టాటా గ్రూపు ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసింది. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం అయిన తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థకు 25.1 శాతం వాటా ఉంటుంది. విస్తారా విలీనం నేపథ్యంలో ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ రూ.3,195 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే టాటా సన్స్ అధీనంలో గల ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ గత నెలలోనే ఎఐఎక్స్ కనెక్ట్ సంస్థను టేకోవర్ చేసింది.